Header Banner

అమెరికాకు భారీ హెచ్చరిక.. తొలి అణు జలాంతర్గామిని నిర్మిస్తున్న నార్త్ కొరియా!

  Mon Mar 10, 2025 14:23        U S A

దక్షిణ కొరియా, అమెరికాలకు సైనికంగా సవాలు విసురుతున్న ఉత్తర కొరియా తాజాగా రష్యా సాయంతో అభివృద్ధి చేసిన నిర్మాణంలో ఉన్న తొలి అణు జలాంతర్గామిని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా శనివారం విడుదల చేసింది. దీనిని ‘అణు ఆధారిత వ్యూహాత్మక గైడెడ్ మిసైల్ జలాంతర్గామి’గా అభివర్ణించింది. దీనిని నిర్మిస్తున్న షిప్‌యార్డ్‌ను ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సందర్శించినట్టు పేర్కొంది. అయితే, అంతకుమించి వివరాలను వెల్లడించలేదు. ఈ నౌక 6 వేల టన్నుల తరగతి లేదా, 7 వేల టన్నుల తరగతికి చెందినదిలా కనిపిస్తోందని, 10 క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని సియోల్‌లోని హన్యాంగ్ యూనివర్సిటీలో బోధకుడిగా పనిచేస్తున్న దక్షిణ కొరియా జలాంతర్గామి నిపుణుడు మూన్ క్యూన్ సిక్ తెలిపారు. ‘వ్యూహాత్మక గైడెడ్ క్షిపణులు’ అనే పదాన్ని ఉపయోగించారంటే అది అణ్వాయుధ సామర్థ్యం కలిగినదని అర్థమని ఆయన పేర్కొన్నారు. తమను (దక్షిణ కొరియా), అమెరికాను భయపెట్టేందుకే దీనిని నిర్మిస్తున్నారని ఆయన వివరించారు. ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, కాకపోతే అంతకుమించిన వివరాలు తెలియరాలేదని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రియాన్ హక్స్ పేర్కొన్నారు.   

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NorthKorea #NuclearSubmarine #KimJongUn